

పండితులు బీటుకూరి శ్రీనివాసాచార్యులురామనామం
విశ్వవ్యాప్తం చేయడం శుభదాయకం
జనం న్యూస్, ఏప్రిల్ 28 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
రామ తాత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారిని రామాలయ ప్రధాన అర్చక పండితులు శ్రీ బీటుకూరి శ్రీనివాచార్యులు ఆదివారం నాడు ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి రోజు లక్షల మంది భక్తులచే రామనామాన్ని లిఖించడానికి మూల కారకులు రామకోటి రామరాజు గారేనన్నారు. మా నాన్న గారు స్వర్గీయ శ్రీ బీటుకూరి రాఘవచార్యుల ఆశీస్సులతో రామకోటి రామరాజు సంస్థను అప్పుడు ప్రారంభించి నేటికీ విశ్వవ్యాప్తం చేయడం అయన రామభక్తికీ నిదర్శనం అన్నారు. భద్రాచలం దేవస్థానం నుండి ప్రతి సంవత్సరం ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చి లక్షల మంది భక్తులకు పంపిణి చేయడం అన్నది అందరికీ సాధ్యం అయ్యే పని కాదని భక్తితో రామకోటి రామరాజు సాధ్య చేస్తున్నాడన్నారు.