

జనం న్యూస్ 30ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని రైతు వేదిక లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి (కొత్త ఆర్ఓఆర్ చట్టం) పైన మంగళవారం రోజున ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి వ్యవస్థ వల్ల రైతులు తమ భూములను తాము అమ్ముకునే పరిస్థితి లేకపోయేధని,ఒకరి భూమి మరొకరికి పేరు మీద ధరణిలో ఎక్కడం జరిగిందని తద్వారా అసలైన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యలన్నీ పరిష్కరించాలనే సంకల్పంతో,భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం భూ భారతి నూతన రెవిన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందని,ఈ చట్టం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని,ఇందిరమ్మ ఇళ్లను కూడా అర్హులైన పేదవారికి అందజేస్తామని,లిస్టులో పేర్లు రాని వారు అధైర్య పడాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి వారికి ఇళ్లు ప్రభుత్వం కట్టి ఇస్తుందని,మండలానికి సంబంధించిన రైతు భరోస కింద 11287 రైతులకు 7 కోట్ల 38 లక్షల 88 వేల రూపాయలు జమ కావడం జరిగిందనీ,రైతు భీమ – 2024-25 – సంవత్సరకాలానికి 41 మంది రైతులు చనిపోగా ఒకొక్కరి 5 లక్షల చొప్పున మొత్తం 2కోట్ల 5లక్షలు జమచేయడం జరిగిందనీ,వరి బోనిస్ (వానాకాలం) 180 రైతులకు 27లక్షల 89వేలు జమ చేయడం జరిగిందనీ,రుణమాఫీ కూడా 5611 మంది రైతులకు 43 కోట్ల 3 లక్షల 89 వేల రూపాయలు మాఫి కావడం జరిగిందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.