Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇచ్చేందుకు గాను 152 మంది సబ్జెక్టు రాష్ట్ర రిసోర్స్ పర్సన్స్ గా పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసింది .మొత్తం 641 మంది దరఖాస్తు చేసుకోగా ఆదివారం జరిగిన ఇంటర్వ్యూలో 393 మంది, హాజరయ్యారు సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండలం నుండి ఇద్దరు ఉపాధ్యాయులు రాష్ట్ర రిసోర్స్ పర్సన్స్ గా ఎంపిక అయినట్లుగా ,మండల విద్యాధికారి వెంకట రాములు, తెలియజేశారు .. ఒకరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరకుంటకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు వై చిన్న బ్రహ్మయ్య, ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాల చెందిన ఓంకార్ రాధ కృష్ణ,సెంకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు రాష్ట్ర రిసోర్స్ పర్సన్స్ గా ఎంపిక అయిన సందర్భం గా అభినందనలు తెలియజేశారు.. జిల్లా రిసోర్స్ పర్సన్స్ కు రాష్ట్ర షెడ్యూల్ ప్రకారంగా ఐదు రోజులు రాష్ట్ర స్థాయి లో శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది అని తెలియజేశారు.