

నగ్మా అజ్మేరి ఆవేదన
భార్య భర్తల మధ్య నలుగుతున్న చిన్నారులు
జనం న్యూస్ 29 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కూరిమెళ్ళ శంకర్ )
చుంచుపల్లి మండల పరిధిలోని శేషగిరి నగర్ గ్రామపంచాయతీ నివాసముంటున్న నగ్మా అజ్మేరి భర్త ఆవిర్ అహ్మద్ దాంపత్య జీవితంలో ముగ్గురు మగ కుమారులను కలిగియున్న తరుణంలో అనూహ్యంగా వారి కుటుంబంలో అనుమానాలు రేకెత్తించడంతో ఆరు నెలలుగా కుటుంబ కలహాలతో వేరువేరుగా జీవనం గడుపుచున్నారు వారి పిల్లల వయస్సు ఐదు ఆరు ఏడు సంవత్సరాల కలిగి ఉన్నారు ముగ్గురు మగ పిల్లలు తండ్రి దగ్గరే ఉంచుకున్నారని తల్లి నగ్మా అజ్మేరి తన పిల్లలను తనకు చూపించ లని భర్తను కోరగా అజ్మీరి అహ్మద్ తిరస్కరించడం జరిగిందని తనను కాపురానికి రావద్దని హెచ్చరించారని నేను నవ మాసాలు మోసి కని పెంచిన నా కుమారులను నాకు దూరం చేయడానికి తట్టుకోలేకపోతున్నానని సలాం ఏదైనా వ్యక్తం చేశారు తదుపరి భద్రాద్రి జిల్లా కలెక్టర్ కి తన పిల్లల్ని తనకు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్న పిదప కలెక్టర్ బాలల సంరక్షణ సమితి వారికి ఇరువురి భార్య భర్తలకి కౌన్సిలింగ్ చేసి కాపురాన్ని సరిచేయాలని సూచించారని వారు సూచించిన సూచనలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు పట్టించుకోలేదని వారం రోజులపాటు నిత్యం వారి కార్యాలయానికి తిరిగిన ఉన్న ముగ్గురు కమిటీలు ఒకరు మాత్రమే బెంచ్ మీద అందుబాటులో ఉంటున్నారని మిగతా ఇద్దరు కమిటీ వారు అందుబాటులోకి రాలేదని తెలియజేస్తున్నారు వారు పట్టించుకోకపోయినా తరువాత మహిళా సంఘాల నాయకురా లను సంప్రదించి ధర్నా కార్యక్రమం చేపడితే తదుపరి రోజు మీ భర్తను పిల్లలను పిలిపించి మాట్లాడుతామని హామీని ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఉదయం 10 గంటల నుండి వేచి ఉన్న చివరకు 12గంటల మధ్యాహ్నం ప్రాంతంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు వచ్చి ఇరువురి భార్యాభర్తలకి కౌన్సిలింగ్ నిర్వహించకుండా తన భర్త ఆవేర్ అహ్మద్ అనుకూలంగా మాట్లాడుతూ నా పిల్లలను కనీసం ఒక గంట సేపు కూడా మాట్లాడనివ్వకుండా చేశారని మా భార్య భర్తల మధ్య కౌన్సెలింగ్ చేసి మా కాపురాన్ని మా కాపురాన్ని సరి చేయాలని వేడుకున్న నాకు న్యాయం చేయలేదని ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పేరుకు మాత్రమే నిర్వహిస్తున్నారని ఉన్న ముగ్గురి కమిటీలు వారికే సమన్వయం లేదని తెలియజేశారు నాకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని నా భర్త నా పిల్లలు నాకే దక్కాలని దానికోసం ఎంత వర కైనా పోరాటం చేస్తానని అవసరమైతే మళ్లీ జిల్లా కలెక్టర్ కలుస్తానని నాకు మద్దతుగా నిలిచిన మహిళా సంఘాల నాయకురాళ్లకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ పోరాటంలో మహిళా సంఘాల నాయకురాలు కరిశ రత్నకుమారి మీదిని లక్ష్మి కనితి నాగమణి ఎస్కే షమీం వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు