

జనం న్యూస్ 30 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలడంతో 8 మంది మృతిచెందారు. వీరిలో ఏడుగురిని కేజీహెచ్‌కు తరలించారు. మరణించిన ముగ్గురు వివరాలు ఇంకా తెలియరాలేదని, నలుగురు పురుషుల్లో ముగ్గురిని గుర్తించినట్లు KGH సూపరింటెండెంట్ శివనంద తెలిపారు. ఎడ్ల వెంకటరావు (45), పత్తి దుర్గస్వామి నాయుడు (33), కుంపట్ల మణికంఠ శేషరావు (28)గా గుర్తించామని… వీళ్లలో ఇద్దరు వెస్ట్ గోదావరికి చెందిన వారని చెప్పారు.