Listen to this article

జనం న్యూస్. ఏప్రిల్ 30. సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)

సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (మే 1వ తేది నుండి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని సంగారెడ్డి జిల్లా యస్.పి.పరితోష్ పంకజ్ ఐపియస్.ఒక ప్రకటనలో తెలియజేశారు.కావున పోలీసుల ముందస్తు అనుమతి లేనిది సంగారెడ్డి జిల్లా ప్రజలు,ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు,నిరసనలు, ర్యాలీలు,పబ్లిక్ మీటింగ్స్, సభలు,సమావేశాలు నిర్వహించరాదని,శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా,ప్రజాధనానికి నష్టం కల్గించే విధంగా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు. ఎలాంటి అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.