

జనం న్యూస్ మే 02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆసిఫాబాద్ డివిజన్ ఏ.ఎస్.పి చిత్తరంజన్ ఐపిఎస్ ఆర్వో వాటర్ ఫిల్టర్ మరియు ఫ్రిడ్జ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడుతూ ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ వైద్య చికిత్సల నిమిత్తం వచ్చే రోగుల కోసం మరియు వైద్యసిబ్బంది కోసం ఆర్వో వాటర్ ఫిల్టర్ మరియు ఫ్రిడ్జ్ కేంద్రాన్ని శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ తో పాటు, ప్రజసేవ కార్యక్రమాలు చేయడంలో జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. వేసవికాలంలో ప్రజల దప్పిక తీర్చేందుకు డివిజన్ ప్రతి మండల కేంద్రంలో ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో పోలీస్ అధికారులతో చలివేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్ తో పాటు ఆసిఫాబాద్ సిఐ రవీందర్, ఆసిఫాబాద్ ఎస్.ఐ లు అంజన్న, ప్రశాంత్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

