

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం.
జనం న్యూస్ మే 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం, బాల్యం, స్మృతులు, కరచాలనాలు, చెమ్మగిల్లిన కళ్ళతో అలింగనాలు గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒకసారి వయస్సు మరచి పోయి చిన్న పిల్లల కేరింతలతో నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణం కోలాహలంగా మారింది.ఈ ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం మునగాల మండల పరిధిలోని నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగగా మారింది.ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులు నాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడిన ఆటలు పాటలు అలరించాయి. వచ్చిన పూర్వ విద్యార్థులు నరసింహులగూడెం పాఠశాల ఆవరణలో పొద్దు పోయే వరకు గడిపి బరువెక్కిన హృదయాలతో ఎవరి గమ్య స్థానాలకు వారు కదిలారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.