

జనం న్యూస్ మే 7 ముమ్మిడివరం ప్రతినిధి
ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో వేంచేసియున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి వారిని విజయవాడ గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ వారు ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకోవడం జరిగినది ఆలయ కార్య నిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ గారు మరియు వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిరి స్వామీజీ వీరేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈవో గారు వేద పండితులు ఆలయ సిబ్బంది స్వామీజీకి స్వామివారి చిత్రపటం శేష వస్త్రము అందించడం జరిగినది ఈ సందర్భంగా స్వామీజీ ఆలయం యొక్క విశిష్టత గురించి అడిగి తెలుసుకుని ఆలయం ద్వారా హిందూ ధర్మ ప్రచారం నిర్వహించాలన్నారు చుట్టుపక్కల భక్తులు ఎక్కువగా ఆలయానికి వచ్చే విధంగా కార్యక్రమాల రూపొందించాలన్నారు ధర్మం మీద దేశం మీద అనేక విధాలుగా దాడులు జరుగుతున్నాయి కనుక ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం సాంప్రదాయాలను పాటిస్తూ అన్యమత ప్రసారాన్ని తిప్పుకొడుతూ దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఆలయం ద్వారా వివిధ గ్రామాలలో హరికథలు బుర్రకథలు ద్వారా హిందూ ధర్మ ప్రచారం ఎక్కువగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎస్ ఎస్ ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు
