

జనం న్యూస్- మే 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ హిల్ కాలనీ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా రవికుమార్ నియమితులైనారు, గతంలో ఇక్కడ పనిచేసిన రాజశేఖర్ నిడమనూరు మండలం వేంపాడు గురుకుల పాఠశాలకు బదిలీ కాగా, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న రవికుమార్ ఇక్కడికి బదిలీపై వచ్చారు. నూతన ప్రధానోపాధ్యాయులుగా రవికుమార్ ఈరోజు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు, బదిలీపై వెళ్లిన రాజశేఖర్ ను సిబ్బంది మరియు ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.