Listen to this article

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఏదైనా ముడుపులు ఇవ్వాలసిందేనా…

పైసలు ఇస్తేనే ఫైల్ ముందుకు… లేకపోతే అడుగుకు….

తహసీల్దార్ కార్యాలయం లో చక్రం తిప్పుతున్న ఇద్దరూ ఎవరు…

అర్హత లేదని ఆగిన సర్టిఫికెట్ మళ్ళీ ఎలా జారీ చేశారు..

జనం న్యూస్ మే 07(నడిగూడెం మండలం ప్రతినిధి ఉపేందర్)

మండలం లోని తహసీల్దార్ కార్యాలయం అవినీతి వలయం లో చిక్కుకున్నదని మండల ప్రజలు వాపోతున్నారు. తహసీల్దార్ కార్యాలయం లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఫైల్స్ ముందు కదలాలి అంటే కనీసం రెండు నుండి ఐదు వేల వరకు ముడుపులు ముట్టజెప్పాలిసి వస్తుందని, కొంచెం తప్పులు ఉన్న 20 నుండి 30 వేల వరకు ముడుపులు ఇవ్వాల్సి వస్తుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థులు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ల కోసం కార్యాలయం చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేలాగా తిరగాల్సి వస్తుందని అదే నాయకులు చెప్పితే నిముషాల వ్యవధి లో పనులు జరుగుతున్నాయని వాపోతున్నారు. ఆ తహసీల్దార్ కార్యాలయంలో బాస్ లుగా చెలామణి అవుతున్న ఆ ఇద్దరికి ఉన్న అధికారాలు ఏంటో తెలియక ప్రజలుl అయోమయానికి గురైవుతున్నారు.రికార్డు అసిస్టెంట్ లు చేయాల్సిన పనులు వాళ్లే చేస్తూ రికార్డు అసిస్టెంట్ లను ఆఫీస్ స్విపర్లు గా చూస్తున్నారని కార్యాలయంలో గుస్సగుస్స లు వినిపిస్తున్నాయి. గతం లో అర్హత లేదని ఈడబ్ల్య్ ఎస్ (ఆర్థికంగా వెనక బడిన సామాజిక తరగతి) సర్టిఫికెట్ తహసీల్దార్ పెండింగ్ పెట్టిన ఫైల్ నెల రోజుల తరువాత ఎలా ముందుకు కదిలింది సర్టిఫికెట్ ఎలా జారీ చేశారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఆఫీస్ లో సిబ్బంది కి ఆదేశాలు జారీ చేస్తున్న అధికారి కాని ఆ అధికారికి ఉన్న అర్హతలు ఏంటో నిగ్గు తేలసాల్సి ఉంది. తహసీల్దార్ సరిత వివరణ:కళ్యాణ లక్మి, షాదీ ముబారక్, ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ కోసం కార్యాలయం వసూళ్ల కు పాలుపడుతున్న విషయం నా దృష్టి కి రాలేదు ఎవరైనా అలాంటి వసూళ్ల కు పాల్పడితే ఉన్నతాధికారులు దృష్టి కి తీసుకెళ్ళి వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.