Listen to this article

పక్కనే స్కూల్ – భయం గుప్పెట్లో విద్యార్థులు టీచర్లు

పట్టించుకో ని అధికారులు లబోదిబో అంటున్న తల్లిదండ్రులు

జనం న్యూస్ 08 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

నేటి బాలలే రేపటి పౌరులు మంచి విద్యతోనే సుభిక్షమైన భవిష్యత్తు అంటూ చిన్న పిల్లలను విద్యార్థులను పొగుడుతూ ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యార్థులు అభివృద్ధికై విద్యా విధానంలో నూతన శకానికై తహతహలాడుతూ అనేక సంస్కరణలు చేపడుతూ ఉంటారు. విద్యా విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు చేకూర్చుతూ పాఠశాలల రూపురేఖలతో పాటు విద్యార్థులలో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తుంటుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచడానికి అనేక రకాల బడ్జెట్లను రూపొందిస్తుంది. పాఠశాల అంద చందాలను, ఉపాధ్యాయుల బోధన విధానంలోనూ మార్పులు రావడంతో విద్యార్థులు ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు స్కూల్ కి వెళ్ళిపోదాం అన్నంత ఆసక్తి నేటి విద్యార్థుల్లో నెలకొంది. తల్లిదండ్రులు కూడా అదే విధంగా సమయపాలన పాటిస్తున్నారు. అయితే స్కూల్ పక్కనే ప్రమాదం పొంచి ఉంది అంటే ఎవరైనా విద్యార్థులు గాని తల్లిదండ్రులు గాని ఆసక్తి చూపుతారా? అదే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది పెదమేడపల్లి గ్రామంలో. వివరాల్లోకి వెళితే పెదమేడపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఎంపీపీ స్కూల్ (రెగ్యులర్) ఉంది. పక్కనే మంచినీటి పథకంలో భాగంగా 90 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్. ఆ ట్యాంక్ నిర్మించి నేటికీ సుమారు 40 సంవత్సరాల పై మాటే మండలంలో పెదమేడపల్లి గ్రామం మేజర్ పంచాయితీగా పిలవబడుతుంది. సుమారు 15 వేలమంది పై సీల్ కు జనాభా కలిగిన గ్రామమంతటికి మంచి నీటిని సరఫరా చేసేది ఆ ట్యాంకే . ఇప్పుడు ఆ ట్యాంక్ శిధిలావస్తులో ఉండడం అనేకమందిని కలవరపరుస్తుంది. ట్యాంక్ కు సంబంధించిన పిల్లర్స్ సిమెంట్ పచ్చులు ఊడిపోయి ఐరన్ కనిపిస్తుండడం, ట్యాంక్ అడుగుభాగమున స్లాబ్ పచ్చులు ఊడి పడిపోతుండడం, చూడడానికి ఎప్పుడు కూలిపోతుందో అన్న ఆలోచన వచ్చే విధంగా కనిపించడం ప్రజలలో కొద్ది ఆందోళన నెలకొంది. ఒకవేళ ఎప్పుడైనా జరగరానిది జరిగితే పక్కనే స్కూలు ఉంది విద్యార్థులు ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటి. చెడును కోరి మంచిని ఎంచమంటారు పెద్దలు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలు, పాఠశాల హెచ్ఎం ఉన్నత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు. ఏ సమయాన్న ఏమి జరుగుతుందో అయోమయ స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయం గుప్పెట్లో విలవిలలాడిపోతున్నారు. ఇదే విషయాన్ని హెచ్ఎం పైడ్రాజు నీ అడగగా పంచాయితీ సెక్రటరీకు , ఎంఈఓ కు, డి ఈ ఓ కు, పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదని ఆర్ బ్ల్యూ ఎస్ వారు మాత్రం వచ్చి పంచాయితీ వారితో కలిసి రిపేర్ వర్కులు చేశారని అయినా భయం గానే గడుపుతున్నామని దానిని పూర్తిగా తీసివేస్తేనే గాని వేరే మార్గం లేదని ప్రమాదం అంచున ఉన్నట్టుగానే ఉందని ఆయన వాపోయారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని విద్యార్థులకు వేసవి సెలవులు కనుక ఈ సెలవుల కాలంలో వాటర్ ట్యాంక్ విషయమై మండల అధికారులు జిల్లా అధికారులు చొరవ తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలగబోయే ఉపద్రవం నుంచి ప్రజలను కాపాడే దిశగా ఆలోచించాలని విద్యార్థులు,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,చుట్టుపక్కల ప్రజలు కోరుతున్నారు.