

జనం న్యూస్ – మే 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి మతసామరస్యాన్ని కాపాడాలని నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ కోరారు. నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో వివిధ మతాల కు చెందిన పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాకిస్తాన్ కి భారతదేశానికి మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మతసామరస్యాన్ని చాటుతూ ఐక్యంగా ఉండాలని బూటకపు ప్రచారాలను నమ్మవద్దని మతాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఎవరైనా నిరసనలు, ధర్నాలు, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతి తప్పకుండా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి మన భారత దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున్ సాగర్ ఎస్సై సంపత్ గౌడ్ మరియు వివిధ మతాల పెద్దలు స్థానిక నాయకులు పాల్గొన్నారు.