Listen to this article

జనం న్యూస్ 20 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా వెంకటేష్ NSUI జిల్లా అధ్యక్షుడు గత కొన్ని సంవత్సరాలనుండి జోగులాంబ ఆలయం మరియు జమ్ములమ్మ మరియు పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం లో దేవాలయ అధికారి గా నిధులు నిర్వహిస్తున్న పురేందర్ అవినీతికి పాల్పడుతున్నారని వెంకటేష్ అన్నారు.ఆలయాలలో అవినీతికి పాల్పడుతూ, అడ్డగోలుగా ఆస్తులు సంపాదిస్తూ, ఆలయాలలో భక్తులు ఇచ్చే కానుకలకు లెక్క, పత్రం లేకుండా, అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడుతున్నాడు.బ్రహ్మోత్సవాల సమయాలలో భక్తులకు సరైన మౌలిక సదుపాయలు కల్పించకుండా కేవలం అధికార మరియు రాజకీయ నాయకులకు రాచ మర్యాదలు చేస్తూ అధికారిగా కాలం వెల్లడిస్తున్నాడు.బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం కు అలంకరణ చేసే వస్తువులు దగ్గర లో ఉన్న కర్నూల్ లో కాకుండా కమిషన్ కోసం హైద్రాబాద్ కి వెళ్లి తీసుకువస్తాడు మరియు పూజ సామాగ్రిని కూడా నాణ్యమైనవి కాకుండా తక్కువ ధరకు తెచ్చి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నాడు.ఈవో చేసే తప్పులను కప్పిపుచ్చే టందుకు కొంతమంది బి ఆర్ ఎస్ నాయకులకు నెలకు 10 వేల రూపాయలు ఇస్తున్నాడు. ఈఓ వల్ల గద్వాల జిల్లాలో ఉన్న దేవాలయాలు బ్రష్టు పట్టి పోతున్నాయి.తన విధులపై నిర్లక్ష్యం గా వ్యవహారిస్తూ, అధికార దూర్వినియోగం చేస్తూ, ఉద్యోగం ముసుగులో రాజకీయాలు చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈఓ పై వెంటనే చర్యలు తీసుకోని ఈఓ పై విచారణ జరిపి వెంటనే చర్య తీసుకోని సస్పెండ్ చేయాలనీ అలాగే తొందర్లోనే దేవాదాయ మంత్రికి మరియు దేవాదాయ కమీషనర్ కు పిర్యాదు చేస్తాము.ఈ కార్యక్రమం లో రాము, దౌలత్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.