Listen to this article

జనం న్యూస్ మే 8 ముమ్మిడివరం ప్రతినిధి


కాట్రేనికోనలో ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో..‌ తేజస్వినీ జ్యోతిషాలయం వేదికగా సంగీత కళాకారిణీ శ్రీమతి ఆణివిళ్ళ శ్రీవాణి సుబ్బలక్ష్మి సహకారంతో ఉచిత స్వర సంగీత శిక్షణ ఆరంభమైంది. ఇప్పటినుంచి 30 రోజుల పాటు ఈ ఉచిత శిక్షణ ఉంటుందని ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జ్యోగయ్య శాస్త్రి ఈ సందర్భంగా తెలియ జేసారు. సంగీత శిక్షణకు విచ్చేసిన వారికి పుస్తకాలు, పెన్నులు ఉచితంగా ఫ్రెండ్లీ క్లబ్ తరపున అందరికి అందజేసారు. ఇందుకు ప్రవేశ రుసుము లేదని, వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చని తెలియ జేసారు.