

కాంగ్రెస్ పార్టీ మండలాల విస్తృత స్థాయి సమావేశంలో.. టిపిసిసి పరిశీలకులు రియాజ్, పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క
జనం న్యూస్ 9మే. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కె.ఏలియా.
జైనూర్: ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా అందరం కృషి చేద్దామని టిపిసిసి కొమరంభీం జిల్లా పరిశీలకులు రియాజ్,కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు. డిసిసి ఆధ్వర్యంలో గురువారం జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో సిర్పూర్ (యూ),లింగాపూర్, జైనూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పరిశీలకులు రియాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆదేశానుసారం జిల్లాలో పార్టీని తిరిగి పటిష్ట స్థితికి చేర్చేందుకు ఈ కార్యక్రమానికి వచ్చినట్టు ఆయన తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం పార్లమెంట్ ఇంచార్జ్ సుగుణక్క మాట్లాడుతూ కష్టపడి పని చేసే వారిని పార్టీ వదులుకోదని, అలాంటి నాయకులుగా ప్రతి ఒక్కరు ఎదగాలన్నారు.