

జనం న్యూస్ 10మే భీమారం మండల ప్రతినిధి(కాసిపేట రవి)భీమారం మండల కేంద్రంలోని శనివారం రోజున, భారతదేశా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళి నాయక్ వీరమరణం పొందారని భీమారం మండల కేంద్రంలోని ఘనంగా నివాళులు అర్పించారు, వర్తక వ్యాపారస్తులు వివిధ సంఘాల నాయకులు పాత్రికేయులు మాట్లాడుతూ సోమవారం రోజున సంపూర్ణ బందుకు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వారి కుటుంబానికి అండగా ఉంటామని. భారతదేశం గర్వించదగ్గ వీరుడుగా వీరమరణం మురళి నాయక్ పొందారని . అతి చిన్న వయసులోనే మరణించడం బాధాకరమైనప్పటికీ ప్రజల హృదయాల్లో సర్దార్ భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాగా ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.