Listen to this article

జనం న్యూస్ మే 10 ముమ్మడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)బహ్రెయిన్ తెలుగు కళా సమితి అధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు వారి జయంతి కార్యక్రమం*ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదేశాలు మేరకు అమరజీవి పొట్టిశ్రీరాములు గారి 125వ జయంతి వేడుకలు ఏడాది పాటు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్న దేశాలల్లో పొట్టిశ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయంగా తొలిసారిగా బహ్రెయిన్ దేశంలో తెలుగుకళాసమితి అధ్యక్షులు పి.జగదీష్ గారి అధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆయన త్యాగం మరువలేనిదని అన్నారు. పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. తెలుగువారి క్షేమం, అభివృద్ధి కోసం తన జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు వారు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీపొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను వీడియో రూపంలో ప్లే చేయడం జరిగింది..కార్యక్రమానికి బహ్రెయిన్ దేశంలోని తెలుగు ప్రజలు భారీగా పాల్గొన్నారు.