Listen to this article

జనం న్యూస్ మే 12 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్‌క్రీములు, శీతలపానీయాలను ఆశ్రయిస్తాం. అందులో కెలోరీలు అధికం. కాబట్టి, వాటిని దూరంగా ఉంచి.. మనకు తగినన్ని పోషకాలను అందిస్తూనే శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.ఎండాకాలం చెమట రూపంలో నీరు ఎక్కువగా శరీరం బయటికి వెళ్లిపోతుంది. శరీర శ్రమ, వ్యాయామం చేసేవాళ్లలో ఇది మరింత ఎక్కువ. అందువల్ల అన్నివేళలా నీళ్ల సీసా దగ్గర ఉంచుకోవాలి. నీళ్లు శరీరాన్ని హైడ్రేట్‌ చేస్తాయి. అలా శరీరానికి చల్లదనం సమకూరుతుంది. అదనంగా ఫైబర్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరం. రోజురోజుకూ ఎండవేడి పెరుగుతున్న క్రమంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన, తీసుకోకూడని ఆహార పదార్థాలేవో తెలుసుకుందాం.-మామిడి మజాచెమట రూపంలో బయటికి వెళ్లిన ద్రవాలను భర్తీ చేసుకోవడానికి నిమ్మరసం, కొబ్బరినీళ్లు, పలుచటి మజ్జిగ తాగాలి. తీపి అంటే నోరు కట్టేసుకోలేని వారికి మామిడిపండ్లు మంచి మార్గంగా నిలుస్తాయి. అలా మిఠాయిల మీదికి మనసు మళ్లకుండా కట్టడి చేసుకోవచ్చు. మామిడి పండ్లలో ఫైబర్‌, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఐరన్‌ పుష్కలం. ఐరన్‌ లోపం ఉన్న మహిళలకు మామిడి పండ్లు మంచి ఫలహారం.-నీళ్లు ‘తినాలి వేసవిలో రంగురంగుల కూరగాయలు, పండ్లను భోజనంలో భాగం చేసుకోవాలి. ఈ రూపంలో శరీరానికి పోషకాల అండ అందించాలి. నీటిశాతం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. మనసు బాగుంటుంది. ఎండవేడిని తట్టుకునే ప్రయత్నంలో చెమట శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అయితే, నీళ్లంటే కేవలం తాగడమే కాదు, తినాల్సి ఉంటుంది కూడా! నీటి శాతం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల తక్కువ కెలోరీలతోనే భోజనం ముగిస్తామని అధ్యయనాలలో వెల్లడైంది.-అంగూర్‌ కర్బూజ-యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సహా విటమిన్‌-సి, వృక్ష రసాయనాలతో సమృద్ధమైన అంగూర్‌ పండ్లు టైప్‌-2 మధుమేహం నుంచి కాపాడతాయి. పైగా వీటిలో సహజమైన తీపితోపాటు నీటి శాతం ఎక్కువ. అధిక నీటిశాతం ఉండే కర్బూజ ఫలాలు.. అధిక కెలోరీలు, అధిక కొవ్వును కలిగిన ఐస్‌క్రీంలకు ఎండాకాలంలో మంచి ప్రత్యామ్నాయం.