Listen to this article

మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కాలే సామెల్

జనం న్యూస్ జనవరి 21 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ : గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామ స్వరాజ్యం సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కాలే సామెల్ అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని వెంకటరామాపురం గ్రామంలో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి 5 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ శాఖ అధ్యక్షుడు గీతా రమేష్ ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు కీత రమేష్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సహకరించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మునగాల మండల ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి, వెంకటేశ్వర్లు, నేలమర్రి గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, సైదయ్య, నరసయ్య, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సతీష్, రాంబాబు, సుధాకర్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.