

జనం న్యూస్ 14 మే బీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
దేవుడా… నువ్వున్నది నిజమైతే నువ్వన్నది నిజమైతే మతాన్ని మాయం చేయ్! మతాల పేరిట మంటలు పెట్టె లుచ్చాగాళ్ళను అంతం చెయ్! ఎందుకయ్యా…. నీ పేరుమీద కుట్రలు చేసేవాళ్లను చూస్తూ వదిలేస్తావ్!
నిన్ను అడ్డం పెట్టుకొని విషం చీమ్మేవాళ్ళను చూస్తూ ఉరుకుంటావ్! నీకోసం అని మారణాహోమం సృష్టించే వాళ్ళను వదిలేస్తావ్! లేదయ్యా…! మంచి గుణం లేదు మానవత్వం లేదు మనిషి తనం లేదు మతం మనిషిని మతి లేని వాడిని చేస్తుంది మతం తోటి మనిషి ప్రాణం తీస్తుంది మతం మనిషిని ఉన్మాదిని చేస్తుంది నీకెందుకయ్యా చెడ్డపేరు! నువ్వు చంపమన్నావా!? నీకు మనుషుల ప్రాణం కావాలా!?
నాకోసం సచ్చిపోండి లేదా చంపండి అన్నావా!? మంచికి కులం మతం అంటగడుతున్నారు
మాటకి మతం రంగు పుస్తున్నారు దేశంలో మంచి చెడులను కులం మతం నిర్దేశిస్తున్నాయి.
మతం మత్తులో దారుణాలకు తెగబడుతున్నారు కులం కుళ్ళుతో ప్రజలను విడగొడుతున్నారు
దేవుడు అనే పదాన్నే ప్రమాదంగా మారుస్తున్నారు. దేవుడా… నా దేశాన్ని కాపాడు
మతం అనే పదాన్నే నా దేశంలో లేకుండా చెయ్! నిజమైన నీ భక్తులకు సర్వజనహితాన్ని ప్రభోదించు
మతం మదంతో కొట్టుకుంటున్న పశువులను అణిచి సక్రమార్గంలో పెట్టు. దేశాన్ని స్వార్థ పరుల చేతిలో పడకుండా శాంతి సహనాలు, ప్రేమాబిమనాలు సోదరా భావాలు వెళ్లి విరిసేలా చూడు.