

జనం న్యూస్ 21 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్గోపికృష్ణ పట్నాయక్ రామతీర్థం బోడికొండపై కోదండ రాముని విగ్రహ ధ్వంసం కేసులో A2 నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 5లక్షలు ఎలా ఇస్తారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆ ఘటనలో నష్టం జరిగిందని బాధితుడికి ప్రజల సొమ్ము ఇవ్వడమేమిటన్నారు.
చిత్తశుద్ధి ఉంటే ఘటనపై దర్యాప్తు చేయాలన్నారు.