

(జనం న్యూస్ చంటి మే 16)
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను తల్లిదండ్రులకు వివరించడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాల లోనే అడ్మిషన్ చేయాలని సూచించడం జరిగింది అదేవిధంగా క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రాజు మాట్లాడుతూ అందిస్తున్నటువంటి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది . ప్రతి పాఠశాలలో కూడా మౌలిక సౌకర్యాలు కల్పించడం జరిగింది. కాబట్టి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే అడ్మిషన్ అయ్యేలా చూడాలని సూచించడం జరిగింది . అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నిరక్షరాస్యులను గుర్తించి డ్వాక్రా మహిళ సంఘాలు అదేవిధంగా పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దల సహాయం తీసుకుని ప్రతి ఒక్కరికి కనీస విద్య నేర్పించి అక్షరాస్యత సాధించాలని సూచించడం జరిగింది . ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ యశోద గ్రామ పెద్దలు మహిళా సంఘాల అధ్యక్షులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మరియుసభ్యులు పాల్గొన్నారు.