Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

చేసిన బిజెపి మంత్రి విజయ్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం రాధాకృష్ణ డిమాండ్.

కాశ్మీర్లోని పహల్గాములో అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు, ఉగ్రవాద శక్తులను బలపరిచే రహస్య శక్తులకు గుణపాఠం చెప్పాలనే సంకల్పంతో భారత ప్రభుత్వం చేపట్టిన సింధూరం కార్యక్రమంలో కీలక బాధ్యత నిర్వర్తించి దేశమాత నుదుట విజయ సింధూరం దిద్దిన కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా మీద కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నుండే కాకుండా శాసనసభ్యుడుగా కూడా అనర్హత వేటువేసి భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు. భారత సైన్యం ఐక్యంగా సాధించిన విజయమే ఆపరేషన్ సింధూర్ అని అన్నారు. బిజెపికి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలతో పాటు సాక్షాత్ ఒక రాష్ట్ర మంత్రి తన వ్యాఖ్యల ద్వారా మత వివక్ష, మహిళా వివక్షకు పాల్పడడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఆపరేషన్ సింధూరం ద్వారా సాధించిన విజయ ఖ్యాతి భారతీయ జనతా పార్టీ నాయకుల వివక్షా పూరిత వ్యాఖ్యల ద్వారా నీరుకారి పోయేలా చేశారని అన్నారు. కల్నల్ సోఫియా ఖురేషి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కున్వర్ విజయ్ షా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు. విజయ్ షా చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఖండించక పోవడం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం కారణంగా విజయ్ షా వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలు గా పరిగణించ వలసి వస్తుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ మనువాద సిద్ధాంతానికి కట్టుబడి ఉందని, విజయ్ షా విమర్శలు భారతీయ జనతా పార్టీ విమర్శలుగా భావించవలసి వస్తుందని అన్నారు. ఇదేనా మీలోని దేశభక్తి అని, బిజెపి నాయకులను రాధాకృష్ణ సూటిగా ప్రశ్నించారు సింధూరం ద్వారా సాధించిన విజయాన్ని బిజెపి నాయకుల వ్యాఖ్యల ద్వారా విషాదంగా మార్చారని తీవ్రంగా విమర్శించారు. మహిళల పట్ల బీజేపీ నాయకత్వానికి ఉన్న భావన ఖురేషిపై చేసిన వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైందని అన్నారు. విజయ్ షా ను మంత్రిగా శాసనసభ్యుడుగా అనర్హుడిగా ప్రకటించడమే కాక తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మహిళలోకాన్ని గౌరవించాలని మహిళల్లో ఉన్న ఆత్మ న్యూనతా భావాన్ని పోగొట్టాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు.