

గ్రామాల్లో వానర దండు
ఇళ్లలోకి చొరబడి బీభత్సం
అధికారులు వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలి
డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్
జనం న్యూస్ మే 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )
వనాల్లో ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి చేరి గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి చేస్తున్నాయని సూర్యాపేట డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ అన్నారు.మునగాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో కోతులు విపరీతమై గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను బెదిరిస్తూ గాయపరుస్తూ హడలెత్తిస్తున్నాయి.రైతులు, జనాలు,కూలీలు,రోజువారీ పనుల్లోకి వెళ్లాలంటే భయం భయంగా వెళ్తున్నారని, కోతులు పిల్లలపై, పెద్దల పై, వృద్ధుల పై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయని,గ్రామాల్లో సాధారణ ప్రజలు కిరాణా సామాన్లు ఉప్పు,పప్పు కొనుక్కోవడానికి వెళ్లాలన్న కూడా భయపడుతూ వెళ్తున్నారని.చివరికి ఇండ్లల్లో చొరబడి అన్నం కూరలు తింటున్నాయని,అడ్డు బోయిన ఇంటి యజమానుల మీద దాడులు చేస్తున్నాయని, కోతుల విద్వంసం దాడుల నుంచి ప్రజలను కాపాడాలని. ఆదివారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో సూర్యాపేట డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ సంబంధిత అధికారులను కోరారు.