Listen to this article

సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు

ఆధ్యాత్మిత కెరటం భవానిలింగం స్వామి అని కొనియాడారు

జనం న్యూస్, మే 20 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను సోమవారంనాడు గజ్వేల్ మండలం అహ్మదిపూర్ గ్రామంలోని అధ్యాత్మిక కెరటం శ్రీ భవానిలింగం స్వామి రజిత దంపతులకు తలంబ్రాల పవిత్రత తెలియజేసి అందజేశారు శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవాసంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ భవానిలింగం స్వామి మహా శివభక్తుడని కొనియాడారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న గొప్ప భక్తుడన్నారు. భగవంతునికి సేవకు మించిన మహా భాగ్యం ప్రపంచంలో మరొకటి లేదన్నారు. ఈ సందర్బంగా ముత్యాల తలంబ్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు.