

జనం న్యూస్ మే 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అప్లై చేసుకున్న అర్హులైన అందరికీ రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా సబ్సిడీ లోన్లు ఇచ్చి ఆదుకోవాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన జిల్లా కొమరం భీం ఆసిఫాబాద్ అని ఈ జిల్లాలో ఉన్న అర్హులైన అందరికీ ఎలాంటి షరతులు లేకుండా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ముఖ్యంగా బ్యాంక్ సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా వెంటనే లోన్లు ఇవ్వాలని అన్నారు,