

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
జనం న్యూస్ మే 19, ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. సోమవారం జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనుల పురోగతిని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా తో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు సచావుగా నిర్వహించాలని, మురుగు కాలువల వ్యవస్థలో మెరుగుపరచడం ద్వారా మున్సిపల్ పరిధిలో మురుగు నీటి సమస్యను పరిష్కరించవచ్చని తెలిపారు. మున్సిపాలిటీలోని వార్డులలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, ప్రతి వార్డులోని ప్రతి ఇంటి నుండి నిత్యం తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరుగా