Listen to this article

జనం న్యూస్ 20 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

తెలంగాణ రాష్ట్రంలోని కాలేశ్వరంలోని సరస్వతి నదీ పుస్కరాలు సందర్భంగా సోమవారం సరస్వతి నదిలో పుష్కర స్నానం ఆచరించిన విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ.పీ.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం వై.యస్.ఆర్.సీ.పీ. సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)గారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు (సిరి సహస్ర) సిరమ్మ. తనకు ఊహ తెలిసినప్పటి నుండి భారతదేశంలో జరుగుతున్న పుష్కరాల్లో ఆమె పాల్గొంటున్నారు. భక్తిశ్రద్ధలతో నదీ పుస్కరస్నానం మాచరించి పూజలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే సరస్వతీ దేవి నదీ పుష్కరాల్లో కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తన తల్లి శ్రీమతి మజ్జి పుష్పాంజలి గారు, తన అత్తలు శ్రీమతి ఎ. రమ గారు, శ్రీమతి కె. అమృత వల్లి గారు, సరలక్ష్మి గారు పాల్గొన్నారు.