

మాలి పటేండ్ల, మాయాజాలం.
జనం న్యూస్, తేది 22 జనవరి,కొల్లూర్ గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజక వర్గం ప్రతినిధి, చింతలగట్టు, నర్సిములు )సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, కొల్లూర్ గ్రామములోని గ్రామ ప్రజలందరికీ ప్రధాన రోడ్డు మార్గం ఇదే. తాత, ముత్తాతల నాడు ఏనాడో వేసిన రోడ్డు మార్గం ఇది. తరతరాల నుండి, అప్పటినుండి ఇప్పటివరకు, గ్రామ ప్రజలందరూ తమ పంట పొలాలకు వెళ్లాలన్న, పశుసంపదను పోషించుకొనుటకు వెళ్లాలన్న, మరియు హిందూ ముస్లిం మతస్తులు వారి, వారి, సంప్రదాయం ప్రకారం, మందిరాలకు వెళ్లాలన్న, ప్రభుత్వం చే గుర్తించబడిన రామేశ్వరాలయానికి వెళ్లాలన్నా, ప్రధాన రోడ్డు మార్గం ఇదే. ఈ దారిని ప్రభూత్వ అధికారులు, ప్రభూత్వ ధనముతో రోడ్డును వేసి, ఎన్నోసార్లు ఈ రోడ్డుకు మరమ్మత్తులు కూడా చేయించారు. అయితే ఈ రోడ్డు తమ భూభాగంలో ఉన్నదని, తమ సర్వే నంబర్ లో నుండి వెళ్లిందని, రోడ్డు వేసిన స్థలం తమదేనని, భూస్వాముల కుటుంబ సభ్యులు అహంకారంతో, జెసిబి వాహనం తెప్పించి వాహనంతో రోడ్డును ధ్వంసం చేయించారు. గ్రామ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలిగించారు. ఇటీ దౌర్జన్యాన్ని సహించని గ్రామ ప్రజలు, తరతరాలుగా రాకపోకలు సాగిస్తున్న ఈ రోడ్డు మార్గాన్ని ధ్వంసం చేయడం సరి కాదని, సంబంధిత ప్రభూత్వ ఉన్నత అధికారులు స్పందించి, రోడ్డు మార్గాన్ని ధ్వంసం చేసిన వారిపై చట్ట ప్రకారం, కఠిన చర్యలు తీసుకుని, రాకపోకలు పునరుద్ధరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.