

జనం న్యూస్ జనవరి 21ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రంలో నీ జేత్వాన్ విద్ద విహార్ లో మార్చి 1 నుండి 10 వరకు నిర్వహించే జిల్లా స్థాయి శ్రామినర్ బుద్ద దీక్ష శిబిరాన్ని జిల్లా ప్రజలు స్వేచ్చందంగా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భారతీయ భిక్షు సంఘ్ ప్రధాన కార్యదర్శి బదంతే బౌద్ధ బిక్షు దమసారథి, నాగపూర్ పట్టణానికి చెందిన బంతే బౌద్ధ బిక్షు రాహుల్ లు పిలుపు ఇచ్చారు.మంగళవారం వాంకిడి కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో నిర్వహించిన ప్రవచనం కార్యక్రమంలో వారు పై విషయాన్ని ప్రకటించారు. వాంకిడిలో నిర్వహించే పది రోజుల బౌద్ధ ధర్మ దీక్ష శిబిరం ప్రతి మనిషిలో మార్పుని తీసుకు వస్తుందని ఇందులో భాగస్వాములై తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని వారు పిలుపునిచ్చారు.