

జనం న్యూస్, 22మే,జూలూరుపాడు:
జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో జాతీయ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో, క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రైవేట్ కంపెనీల యాజమాన్యంతో మాట్లాడి క్షయ వ్యాధి గ్రస్తులకు అందరికీ పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. జూలూరుపాడు లోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం క్షయ వ్యాధిగ్రస్తులకు 23 పౌష్టికాహార కిట్లను ఆరు నెలలకు సరిపోను కిట్లును పంపిణీ చేయడం జరిగింది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా విశేష కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వాసుపత్రులకు ఏమి కావాలన్నా ప్రభుత్వం నుండి ఒప్పించడానికి నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంగీలాల్ నాయక్, మాజీ ఎంపిటిసి మధు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.