

జనం న్యూస్ మే 27 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
వేసవి కాలం సందర్భంగా కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీలోని కూకట్ పల్లి ఆంధ్రప్రభ విలేకరి దాసరి రాహుల్ ప్రదీప్ వారి కార్యాలయం వద్ద ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం గత నెల రోజులుగా వారి అమ్మా నాన్న అయిన దాసరి శ్రీనివాస్ రావు మైనేని ప్రసన్న జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్భంగా మంగళవారం రోజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై మజ్జిగ మరియు అరటి పండ్లు ను పంచడం జరిగింది వారితోపాటు పి ఎల్ ప్రసాద్, పోశెట్టి గౌడ్, కాశీనాథ్ యాదవ్ పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి కాలనీవాసులు, వ్యాపార సముదాయంలో పనిచేసేవారు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు ప్రతి రోజు ఎడు వందల నుంచి తొమ్మిది వందల మంది వరకు మజ్జిగను సేవిస్తున్నారు, ఎండలు తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రయాణికులు మజ్జిగ సేవించి ఉపశమనం పొందుతున్నారు, “మానవ సేవే మాధవ సేవ” మానవత దుప్రదంతో వేసవి పొడవునా మజ్జిగ పంపిణీ చేస్తున్న రాహుల్ ప్రదీప్ ను వారి స్నేహితులు తెల్ల హరికృష్ణ, బుల్లెట్ రవి, రాకేష్, టెన్ టీవీ హరి, అర్జున్, రవీందర్, మహేష్, మారుతి, అనిల్, శంకరయ్య తదితరులను ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించడం జరిగింది.