Listen to this article

అధికారులను నిలదీసిన గ్రామ ప్రజలు అర్హత కలిగిన వారికే సంక్షేమ పథకాలు ప్రత్యేక అధికారి ఎమ్మార్వో

జనం లైవ్ న్యూస్,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పీఎం దామరగిద్ద గ్రామంలో స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజా పాలన గ్రామసభను బుధవారం నిర్వహించారు.ప్రజా పాలన గ్రామసభ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామసభ ప్రత్యేక అధికారి అబ్దుల్ నజీమ్ ఖాన్, మాట్లాడుతూ రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కర్డ,26 జనవరి నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను అర్హులైన వారికి అందించే కొరకే ప్రజా పాలన గ్రామసభను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పథకాలను ప్రభుత్వం నిజమైన అర్హతదారులకి అందించాలన్న సదుద్దేశంతో గ్రామాలలో గ్రామసభ నిర్వహించుచున్నారని అన్నారు.గ్రామ సభలో పలువురు గ్రామస్తులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అర్హత లేని వారి పేర్లు జాబితాలో రావడంతో గ్రామస్తులు గ్రామసభ అధికారులకు ప్రశ్నించారు.నిజమైన అర్హులకే ప్రతి పథకాన్ని అందించాలని అందాలని గ్రామ యువజన సంఘం నాయకులు గ్రామస్తులు అధికారులను విన్నవించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అబ్దుల్ నజీమ్ ఖాన్,కార్యదర్శి శ్రీనివాసరావు, ఏఈవో గీత,ప్రధానోపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి,గ్రామ పెద్దలు మనోహర్, సాయిలు,మారుతిరావు,శ్రీపతి,తదితరులు పాల్గొన్నారు.