Listen to this article

జనం న్యూస్ మే 31 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు వాటి ద్వారా పేదలు పొందుతున్న లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కామారెడ్డిలో జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, సూచించారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలు పక్కగా ప్రభుత్వం అమలు చేస్తోందని వాటిని పేదలకు అందేలా చూడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అపోహ వద్దని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల అమలు, అభివృద్దే లక్ష్యంగా ప్రజా పాలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేతృత్వంలో ముందుకు సాగుతుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్ళుగా రేషన్ కార్డులు, ఇళ్లు జారీ చేయక సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అధికారంలోకి రాగానే రాష్ర ప్రభుత్వం రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో గ్రామాల్లో సామాన్య ప్రజలు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి జాబితాలో అర్హత కలిగి పేర్లు లేని నిరుపేదలు ఆందోళనకు గురికావద్దని తన దృష్టికి తీసుకురావాలని తెలిపారన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతరం కొనసాగనుందని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారని ఆయన అన్నారు. రాష్ట ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యువతకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందిస్తోందన్నారు. ఈ పథకం యువతను ఆర్థికంగా బలోపేతం చేసి నిరుద్యోగాన్ని తగ్గిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తు తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ లకు ధన్యవాదాలు. తెలుపుతున్నామన్నారు.