Listen to this article

జనం న్యూస్ మే31 ముమ్మిడివరం ప్రతినిధి


ఈరోజు కాట్రేనికోన మండలం సిరయానం గ్రామం లో ముమ్మిడివరం భారతీయ జనతా పార్టీ కాట్రేనికోన మండల అధ్యక్షులు మట్టా శివకుమార్ అధ్యక్షతన సమావేశం జరిగినది ఈ సమావేశం ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గోలకోటి వెంకటరెడ్డి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ హాజరైనారు ఈ కార్యక్రమంలో అల్యాబాయ్ యొక్క చరిత్రను తెలియజేస్తూ 300 సంవత్సరాల క్రితమే మహిళలు చైతన్యపరిచి వారికోసం అనేక కార్యక్రమాలను రూపొందించి దేశ సంస్కృతిని కాపాడినటువంటి పవిత్ర మూర్తి గూర్చి అందరికీ తెలియజేయడం జరిగినది అలాగే మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చైతన్యవంతులు కావాలని ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెంది ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కాట్రేనికోన బిజెపి సీనియర్ నాయకులు మట్టా సూరిబాబు ముమ్మిడివరం సమరసత సేవ ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు శీలం కృష్ణ సంఘాని కృష్ణయ్య సంఘాన్ని ధన కుమారి కర్రి భవాని వెంకటేశ్వరరావు పాలెపు లక్ష్మీపతిరావు తదితరులు పాల్గొన్నారు