Listen to this article

జనం న్యూస్ జనవరి 22, (జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్):- జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం : మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటానని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. బుధవారం నిజామాబాద్ లోని ఆయన కార్యాలయంలో అర్వింద్ ధర్మపురి బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని 6 మంది బూత్ స్థాయి కార్యకర్తలకు 1.40 ఒక లక్ష నలభై వేల రూపాయల లక్షల చెక్కులను మండలాల అధ్యక్షులు బాయి లింగారెడ్డి మరియు మండలం నాయకులు ల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేస్తూ చనిపోయిన, వివాహమైన, నూతన గృహప్రవేశం, హాస్పిటల్ బిల్లులు తదితర కేసులకు ఫౌండేషన్ ద్వారా కార్యకర్తలకు తగిన సహాయం చేస్తానన్నారు. కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఎంపీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సుంచు రణధీర్, జిల్లా sc మోర్చా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు బైన మహేష్, మండల ఉపాధ్యక్షులు తిరుమల చారి, శక్తి కేంద్ర ఇంచార్జ్ లు ముద్ద నరేష్,దగుల్ల అశోక్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు గంగుల మనోజ్, బూత్ అధ్యక్షులు బైన మల్లేష్, నాయకులు కల్లెడ శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎంపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.