

ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ
మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్ .
జనం న్యూస్ జనవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇళ్ళు 4 పథకాలు అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా నేడు సిర్పూర్ యు మండలం పంగిడి గ్రామ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్. ఈ సందర్భంగా చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ గారు మాట్లాడుతూ:
ఈనెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోస,రైతు భరోస,నూతన రేషన్ కార్డుల పంపిణీ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు.ఈ క్రమంలో అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేరు లేని పథకాలకు అర్హులైన లబ్ధిదారులను దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు.నేటి నుంచి ఈ నెల 26 వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్న తరుణంలో సభలలో సైతం దరఖాస్తు చేసుకోవచ్చని లబ్ధిదారులకు సూచించారు. దీనిపై అర్హులు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సాగుభూములకే రైతు భరోసా ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతను ఇవ్వడం,భూమి లేకుండా ఉపాధి హామీ పనిచేసుకునే నిరుపేదలకు ఆర్థిక భరోసా ఇవ్వడం,గత పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు ఇవ్వడం లాంటి పథకాలు ప్రవేశ పెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ , కూడ్మేత సుధాకర్ , ఏఓ , ఆనంద్ రావ్ , మాజీ సర్పంచ్ జలీమ్ షా ఆత్రం శంకర్ ,కార్యదర్శి, అగ్రికల్చర్ ఆఫీసర్, ఈ జీ యస్ ఆఫీసర్ , పెందోర్ ప్రకాష్ , కనక గంగారాం , షైక్ హైదర్ తదితరులు పాల్గొన్నారు.