Listen to this article

జనం న్యూస్ 02 జూన్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు )

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంచాయతీ సెక్రెటరీ అబ్దుల్లా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇవాల్టితో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి 11ఏళ్లు పూర్తయ్యాయి. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. నేడు తెలంగాణ 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఒకరికొకరు హార్దిక శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ మనీల, ఆశ వర్కర్ మంజుల, ఫీల్డ్ అసిస్టెంట్ రాములు మరియు గ్రామస్తులు సామేల్, అబ్రహం, చిన్నప్ప, కావలి రవి, బందయ్య, యాదయ్య, నెంబర్ రవి, శ్రీను, బల్తరాజు, దోమ రవి, వెంకటేష్ యువకులు పాల్గొన్నారు.