

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 2 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
గత ఏడాది జూన్ 4న ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారన్నది జగన్ ఉద్దేశమా ప్రత్తిపాటి.
తండ్రికి వెన్నుపోటు.. బాబాయ్ కి గొడ్డలిపోటు.. తన కోడికత్తి గాటు..గులకరాయి గీటు ఇవే జగన్ రాజకీయాలు ప్రత్తిపాటి
జగన్ మాజీ ముఖ్యమంత్రిలా కాకుండా మాజీ ఖైదీలానే ఆలోచిస్తున్నాడు ప్రత్తిపాటి “4వ తేదీన జగన్ ఎందుకు వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చాడో చెప్పాలి. తనను, తన పార్టీని దారుణంగా ఓడించి, 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారన్నది జగన్ ఉద్దేశమా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గౌరవించని, వారి అభిప్రాయాలు.. ఆలోచనలకు విలువ ఇవ్వని ఏకైక రాజకీయ నాయకుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు. నిర్మాణాత్మక సూచనలు, వివరణాత్మక చర్యలతో రాష్ట్రాభివృద్ధికి సహకరిద్దాం.. పాలకపక్షానికి మంచి సూచనలు, సలహాలు ఇద్దామనే కనీస ఆలోచన కూడా జగన్ కు లేకపోవడం విచారకరం. వ్యక్తిగత అజెండా స్వప్రయోజనాలే లక్ష్యంగా జగన్ ప్రతి అంశాన్ని రాజకీయం చేయడానికి పాకులాడుతున్నాడు. కూటమిప్రభుత్వ ప్రజారంజక పాలనపై అక్కసుతో జగన్ తనకు తానే వెన్నుపోటు పొడుచుకుంటున్నాడు కన్నతల్లి.. చెల్లి సంతోషాన్ని జీర్ణించుకోలేని జగన్ ప్రజల ఆనందాన్ని సహిస్తాడా జగన్ ఏ విషయంలోనూ మాజీ ముఖ్యమంత్రిలా ఆలోచన చేయడం లేదు.. చర్లపల్లి జైల్లోని మాజీ ఖైదీలానే ఆలోచిస్తున్నాడు. తండ్రికి వెన్నుపోటు.. బాబాయ్ కి గొడ్డలిపోటు.. కోడికత్తి గాటు..గులకరాయి గీటు ఇవే జగన్ రాజకీయాలు జగన్ చేయాల్సింది వెన్నుపోటు దినం కాదు… పశ్చాత్తాప..ప్రాయశ్చిత్త… సంతాప దినాలు. తన దుర్మార్గపాలనతో సర్వం కోల్పోయిన ప్రజలకు క్షమాపణ చెబుతూ ఒక ఏడాది ప్రాయశ్చిత్త దినాలు చేయాలి. తన ధనదాహానికి, దోపిడీకి బలైన లక్షల కుటుంబాలకు సంఘీభావంగా మరో ఏడాది పశ్చాత్తాప దినాలు పాటించాలి. తన కల్తీ మద్యానికి, నిర్లక్ష్యపాలనకు అన్యాయంగా బలైనవారి ఆత్మశాంతికోసం ఇంకో సంవత్సరం సంతాప దినాలు చేపట్టాలి. చేసిన తప్పులు,మోసాలు ఒప్పుకొంటూ, మూడేళ్లపాటు ప్రజల్లో తిరిగి, 2029 ఎన్నికల నాటికి ప్రజలను ప్రాధేయపడితే జగన్ పాపాల్లో కొన్నైనా పరిహారమవుతాయి. కూటమిప్రభుత్వ ప్రజారంజక పాలనపై అక్కసుతో జగన్ తనకు తానే వెన్నుపోటు పొడుచుకుంటున్నాడు. పదవి కోసం తండ్రికి వెన్నుపోటు… ఎన్నికల్లో గెలుపుకోసం బాబాయ్ కి గొడ్డలిపోటు… సానుభూతి కోసం తనకు తాను చేయించుకున్న కోడికత్తి గాటు.. గులకరాయిగీటు ఇవే జగన్ రాజకీయానికి మూలస్తంభాలు అని ప్రత్తిపాటి ఒక ప్రకటనలో ఎద్దేవాచేశారు.