Listen to this article

రైతులకు అండగా ఉంటాం

.మార్కెట్ వ్యవస్థపై నమ్మకం కలిగేలా కృషి చేస్తాం..

దడ్వాయి,హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

జనం న్యూస్, జూన్ 2, కుమార్ యాదవ్, జమ్మికుంట,

మార్కెట్ల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను త్వరలో తీసుకొస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.సోమవారం జమ్మికుంట పట్టణంలో గల వ్యవసాయ మార్కెట్ లో కార్మికులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులే మార్కెట్లకు పునాది అని వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.మూడేళ్ల పాటు ఎదురుచూసిన పాలకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసుకున్నామని,ప్రభుత్వానికి రైతులకు వారధిగా ఉంటూ వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని తెలిపారు.దడ్వాయి,హమాలి వారి విజ్ఞప్తి మేరకు మార్కెట్ లో నెలకొన్న సమస్యల పరిష్కారాలకు,వారు అడిగిన వాటికి,అభివృద్ధి పనులకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
బీజేపీ,బీఆర్ఎస్ దొందూ దొందే..ప్రణవ్ రాష్ట్రంలో కుస్తీ,దేశంలో దోస్తీ అన్నట్టు బీఆర్ఎస్,బీజేపీ పార్టీలు వ్యవహరిస్తున్నాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.సాక్ష్యాత్తు కేసీఆర్ కూతురు కవిత చెప్పిన మాటలు బీజేపీ నాయకులు దాన్ని ఆమోదించడం చూస్తే వారి దోస్తీ ఏ విధంగా ఉందో ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతుందని అన్నారు.గతంలో ఎన్నికల సమయంలో ఈ విషయంపై అనేక సార్లు తాను మాట్లాడానని ఇప్పుడది రుజువైందని అన్నారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్,వైస్ చైర్మన్,డైరెక్టర్లు,సెక్రెటరీ,హమాలీ దడ్వాయి సంఘం అధ్యక్షులు,కాటన్ మిల్ అసోసియేషన్,మాజీ అధ్యక్షులు,జమ్మికుంట పట్టణ,మండల నాయకులు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.