Listen to this article

జనం న్యూస్ జూన్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


[ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయం నందు సి డి పి ఓ మేడమ్ ఐ విమల ఆధ్వర్యంలో “యోగాంధ్ర” కార్యక్రమం నిర్వహించటమైనది.అందమైన మరియు ఆకర్షణీయమైన యోగా చేస్తున్న వివిధ రూపాలను మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు ముగ్గుల రూపంలో ప్రదర్శించటం జరిగింది.ఐ సి డి యస్ సూపర్వైజర్లు శ్రీమతి కె వి వి యస్ తులసి కుమారి, కుమారి ఎల్.వి.రమణి, శ్రీమతి సి.హెచ్ జయవాణి పర్యవేక్షణలో కార్యక్రమం ఘనంగా నిర్వహించటం జరిగింది.కార్యక్రమం నందు ఎమ్ పి డి ఓ, ఎమ్ ఆర్ ఓ, డిప్యూటీ ఎమ్ పి డి ఓ, ఆర్ డబ్ల్యు జే ఈ, ఎమ్ ఏ ఓ,అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు హాజరు అయ్యారు