

జనం న్యూస్ జనవరి(22) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాలు గురించి అధికారులు తెలపడం జరిగింది ఒకటి ఇందిరమ్మ ఇండ్లు రెండు రైతు భరోసా మూడు రేషన్ కార్డులు నాలుగు ఆత్మీయ భరోసా అంశాల గురించి అధికారులు గత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను గుర్తించి ప్రజలకు తెలియజేయడం జరిగింది మరియు గత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోనటువంటి వారు ఈరోజు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది కానీ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, లేదా రేషన్ కార్డు లబ్ధిదారులు, లేదా రైతు భరోసా లబ్ధిదారులను, లేదా ఆత్మీయ భరోసా లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం విచారకరం, ఆత్మీయ భరోసా లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం ఉపాధి హామీ జాబ్ కార్డు పొందియుండి 2003, 2004 సంవత్సరాలలో కనీసం 20 రోజులు పని చేసి ఉండాలి అనే నిబంధన పెట్టడం జరిగిందని తెలియజేయడం బాధాకరం ఎలాంటి భూమి లేకుండా ఉపాధి హామీ కార్డు కలిగియున్న నిరుపేదలకు ఆత్మీయ భరోసా సంవత్సరానికి 12 వేల రూపాయలు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో అట్టి హామీని నిలబెట్టుకోవాలనిరు పేద ప్రజలకు అండగా ఉండాలని, జాబు కార్డు ఉండి 2023, 2024 లో పని దినాలు 20 రోజులు కలిగి ఉండటం అనే నిబంధన పేద ప్రజలు కుటుంబ పోషణం కోసం వలసలు వెళ్లి పట్టణాలలో నివసించి అనేక ఇబ్బందులు పడి తిరిగి గ్రామాలలో నివసించడం జరుగుతుంది. ఈ నిబంధన పేద ప్రజలకు అన్యాయం జరిగే విధంగా ఉంది కాబట్టి ఈరోజు ప్రజాపాలన స్పెషల్ అధికారి గారికి సిపిఎం పార్టీ మద్దిరాల మండల కార్యదర్శి పోలోజు సైదులు మాజీ ఎంపీటీసీ పాల్వాయి కవిత గ్రామ కార్యదర్శి కన్నె వీరయ్య గంగా సిరి వెంకన్న దీకొండ ఉపేందర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది