

బాధే పల్లి సిద్దార్థ, మార్కెట్ కమిటీ డైరేక్టర్ టి.కర్ణకర్ , సిఐటియు రాజు, ఎం జనార్ధన్, టెలిఫోన్ వెంకటయ్య, అర్జునప్పా, జాంగారి రవి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ లక్ష్మన్ , గొర్ల రాముల అభినందనలు
( పయనించే సూర్యుడు జూన్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్ నగర్ పట్టణానికి చెందిన నాగమణి మేడం కుమారుడు భరద్వాజ్ సివిల్స్ ఫలితాలలో 905 ర్యాంక్ సాధించిన సందర్బంగా తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , సీనియర్ కాంగ్రెస్ నేత బాధే పల్లి సిద్దార్థ, మార్కెట్ కమిటీ డైరేక్టర్ కర్ణకర్ ,సి ఐ టి యు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు, ఎం జనార్ధన్, టెలిఫోన్ వెంకటయ్య, అర్జునప్పా, కాంగ్రెస్ పార్టీ యువ నేత జాంగారి రవి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ లక్ష్మన్ , గొర్ల రాము భరద్వాజ్ ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలపడం జరిగింది. బాధే పల్లి సిద్దార్థ మాట్లాడుతూ భరద్వాజ్ డి ఆర్ డి వో లో సైంటిస్ట్ గా, ఐఏఎస్ గా, గ్రూప్ వన్ లో కూడ సెలెక్ట్ కావడం సంతోషకరమని అన్నారు. యువత భరద్వాజ్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఇటీవల కాలంలో షాద్ నగర్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు సివిల్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించడం చాలా అభినందనీయం అని అన్నారు. రానున్న రోజుల్లో మన ప్రాంతానికి చెందిన విద్యార్థులు సివిల్స్ లో మరిన్ని విజయాలు సాధించిp మన షాద్ నగర్ ప్రాంతానికి మంచి గుర్తింపు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధేపల్లి సిద్దార్థ, మార్కెట్ కమిటీ డైరేక్టర్ కర్ణకర్ ,సిఐ టి యు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు, జేఏసీ నేతలు ఎం జనార్ధన్, టెలిఫోన్ వెంకటయ్య, అర్జునప్పా, గొర్ల రాము, కాంగ్రెస్ పార్టీ యువ నేత జాంగారి రవి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ లక్ష్మన్ , తదితరులు పాల్గొన్నారు..