Listen to this article

జనం న్యూస్ 04 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

వివిధ కారణాలతో ప్రసవ సమయంలో, ప్రసవానంతరం గర్భిణులు, శిశువులు మృతి చెందడం పట్ల కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయా సంఘటనలపై సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని మంగళవారం నిర్వహించిన జిల్లా ఎంపీసీడీఎస్‌ఆర్‌ కమిటీ సమావేశంలో వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. తప్పు చేసినవారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.