Listen to this article

నడిగూడెం,జనవరి 22,జనం న్యూస్:- గంజాయి, డ్రగ్స్ పై విద్యార్థులు అవగాహనా కలిగి ఉండాలని ఎస్. ఐ అజయ్ కుమార్ సూచించారు.బుధవారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో గంజాయి,డ్రగ్స్ లపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎస్. ఐ మాట్లాడుతూ… గంజాయి, డ్రగ్స్ అమ్మిన,రవాణా చేసిన చట్టపరమైన కేసులు నమోదు అవుతాయని తెలిపారు. విద్యార్థులు ఇంటికి పక్కన వారికి, బంధువులకు గంజాయి వినియోగించటం వలన జరిగే అనర్థాలను వివరించాలన్నారు. మీ ఇంటి చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గంజాయి కలిగి ఉన్నా, సేవించిన, ఎటువంటి సమాచారం అయినా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్,పోలీస్ సిబ్బంది కళాశాల సిబ్బంది, విద్యార్థినీలు పాల్గొన్నారు.