Listen to this article

జనం న్యూస్ జూన్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాజి అనిల్ గౌడ్ అన్నారు
తిర్యాణి మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి, గంగాపూర్ జంగుబాయి గుడి, ఆవరణంలో నిర్మించే రేకుల షెడ్లను భూమి పూజ కు వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారుముందుగా తిర్యాణి గౌడ సంఘ నాయకులు వారిని చాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారుఅనంతరం గుండ్ల ఆవరణలో 5 లక్షల వ్యయంతో నిర్మించే రేకుల షెడ్ల భూమి పూజ చేశారుఈ సందర్భంగా అనిల్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న యెన్నో గ్రామాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహర్ధశ పట్టిందని అన్నారు ఎన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరెన్నో పథకాలు కొనసాగిస్తుందని తెలిపారు