Listen to this article

జనం న్యూస్ 06జూన్ పెగడపల్లి ప్రతినిధి


జగిత్యాల జిల్లా పెగడపెల్లిమండలం బిజెపి మండల శాఖ అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈసందర్బంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ వాతావరణం వస్తున్న మార్పులు, కాలుష్యం పెరుగుదల, గ్లోబల్ వార్మింగ్ నుండి భూమి మీద నివసించే జీవ వైవిధ్యాన్ని కాపాడం కోసం మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జూన్ 5 నుండి ఆగస్టు 15 వరకు జరుపనున్న కార్యక్రమంలో భాగంగా నందగిరి గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు.ప్లాస్టిక్ వాడకం తగ్గించడంతో పాటు చెట్లు నాటడం వాటిని రక్షించడం ప్రతి ఒక్కరి భాద్యత అని మన పూర్వికులు నాటిన మొక్కలు నేడు చెట్లుగా పెరగడం వల్లనే మనం ప్రయోజనం పొందుతున్నామని కలుషిత గాలిని శుద్ధి చేయడం ప్రాణవాయువును అందించడం పూలు పండ్లు కాయలు కానుకగా మన ఆకలి తీరుస్తున్నాయని అన్నారు.భావితరాల భవితవ్యం కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగుల కొమురెల్లి,కోట మల్లేశం,తోడేటి గట్టయ్య,కూన సాగర్,పెద్ది భీరయ్య, పూసాల సునిల్,మరియు ప్రజలు పాల్గొన్నారు.