Listen to this article

జనం న్యూస్ జూన్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ఆసిఫాబాద్ జిల్లా కు నూతనంగా ఎస్పీ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా ఆసిఫాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ ఎస్పీ కార్యాలయంలో నూతన ఎస్పీ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలతో మమేకమై వెనుక బడిన ఆదివాసీ గిరిజన ప్రజలను సమన్వయం చేసుకుంటూ వారిలో ఉన్న ముడవ నమ్మకాల నుంచి బయటికి తీసి టెక్నాలజీ తో పరుగులు పెడుతున్న సమాజానికి ఆదివాసీ గిరిజన ప్రజలను పరిచయం చేయాలని కోరారు అలాగే యువత ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసే గంజాయి మత్తు పదార్థాల అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వారి వెంట స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిజాం బీసీ సంఘం నాయకులు జక్కన్న బాలు గారు వెంకటేష్ పాల్గొన్నారు_