

రోడ్ల విస్తరణలో ప్లాట్లు పోయే ప్రమాదం ఉంది…
కొనుగోలుదారులు జాగ్రత్త….
ఎంఎల్ఏ కృష్ణారావు హెచ్చరిక.
జనం న్యూస్ జనవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌసింగ్ బోర్డు అధికారులకు సూచించారు. హౌసింగ్ బోర్డు అధికారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మునిసిపల్ చట్టాలను, మాస్టర్ ప్లాన్ లను పరిగణనలోకి తీసుకోకుండా ప్లాట్లను అమ్ముకుని సొమ్ముచేసుకోవడమే ధ్యేయంగా పనిచేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానంగా హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ప్రకారం కె పి హెచ్ బీ కాలనీ ఏడవ ఫేస్ నుంచి గోపాల్ నగర్ వైపు రెండు వందల ఫీట్లుగా నిర్ణయించిన రోడ్డు కు పక్కన ఉన్న 146 గజాలు , 78 (50) గజాల రెండు ప్లాట్ లకు యనబై ఫీట్ల రోడ్డును చూపుతూ అమ్మకానికి పెట్టడం ద్వారా మోసం చేస్తున్నారని విమర్శించారు. అ రెండు ప్లాట్లను కొనుగోలు చేసేవారు రేపటి రోజున రోడ్డు విస్తరణలో ప్లాట్లు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. అధికారులు మాత్రం రోడ్డులో ప్లాట్లు పోతే జి హెచ్ ఎమ్ సి నష్ట పరిహారం కింద టీడీఆర్ ఇస్తారని చెపుతున్నారని అలా చూసినా సరే ప్లాట్ కొన్న ధరకు టీడీఆర్ ధరను పోల్చితే పావు వంతు కూడా రాదని తెలిపారు.